Pinned
పుస్తక సంచారి
1,162 posts
ఏం చేస్తానంటే ఆదివారం ఆదివారం అబిడ్స్ , ఆర్టీసీ క్రాస్రోడ్స్, చిక్కడపల్లిలో అద్భుతమైన తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాల కోసం వెతుకుతూ ఉంటా.
Joined March 2022
- మొత్తానికి ఈ ఆదివారం అబిడ్స్, చిక్కడపల్లి రోడ్లలో దొరికిన వజ్రాలు, ముత్యాలు ఇవి.
- అబిడ్స్ లో ఈ రూల్ పుస్తకాలు దొరికాయి. ఒక్కో పుస్తకంలో 474 పేజీలు ఉన్నాయి. వెల 30/-. అద్భుతంగా ఉన్నాయి. పాత కాలపు అకౌంట్ పుస్త కాల్లా antique look. మారు మాటాడకుండా తీసుకున్నా.
- విజేత పబ్లికేషన్ అని తేలిగ్గా తీసుకున్న. తెరిచి చూస్తే ప్రింటింగ్ క్వాలిటీ బాగుంది. వాక్యమూ సరళంగా ఉంది. 50 కే దొరికింది.
- పుస్తకాలు ఎందుకు చదవాలో తెలుసుకోవాలంటే ఈ వ్యాసం చదవండి. must read
- చరిత్ర పిచ్చి కాస్త జాస్తి ఉన్న నాకు మల్లం పల్లి వారి ఈ రేర్ ఎడిషన్ విడిచిపెట్ట బుద్ధేయలేదు
- నన్నయ్య నుంచి యండమూరి వరకు దాదాపు 500 మంది రచయితలు రాసిన 5 వేల గ్రంథాలు నుంచి బూదరాజు రాధాకృష్ణ గారు సేకరించిన మరవరాని మాటలివి. సాహిత్య అభిమానులు తప్పక చదవాల్సిన పుస్తకం.
- లైబ్రరీ కార్డ్ ఉండటం అప్పట్లో హోదాకు చిహ్నం. ఇప్పుడు లైబ్రరీలూ లేవు. ఈ కార్డులూ లేవు. మళ్ళీ ఆ కాలం రావాలని అందరమూ కోరుకుందాం.
- #కన్యాకుమారి సినిమా ఎందుకు చూడాలంటే ఈ అమ్మాయి కోసం చూడాలి. అద్భుతంగా నటించింది.
- అమరావతి కథలు.. ఎవర్ గ్రీన్ పుస్తకం , ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామని తీసుకున్నా.
- చాలా సంవత్సరాల నుంచి వెతుకుతున్న పుస్తకమిది. అమెజాన్ లో ఉంది గానీ రేటు ఎక్కువ. ఈ రోజు చిక్కడ పల్లిలో దొరికింది. నా ప్రమాణాలు ప్రకారం ధరే ఎక్కువే గానీ తప్పలేదు. #thelastnizam























