భారతీయ భాషా సాహిత్యాన్ని సూటిగా మూలంనుండి తెలుగులోకి అనువాదం చేయకుండా ఆంగ్ల అనువాదం ఆధారంగా అనువాదం చేయడం ఒక రకమైన సాంస్కృతిక అపరాధంగా పరిగణించాలి. […]
వేలూరి వేంకటేశ్వరరావు 1938–2026
ప్రవాసాంధ్ర సాహిత్య దిగ్గజం, ఈమాట పత్రిక విశ్రాంత సంపాదకులు, బహుముఖ ప్రజ్ఞాశాలి, సదా ఈమాట పత్రికకు శ్రేయోభిలాషి అయిన డా. వేలూరి వేంకటేశ్వర రావుగారు ఫిబ్రవరి 7, 2026 ఉదయం ఈలోకం విడిచి వెళ్ళారు. అమెరికాలోని ఫీనిక్స్ నగరంలో విశ్రాంత జీవితం గడుపుతూ, తన చివరి శ్వాస వరకు తెలుగు సాహిత్యం గురించే ఆలోచించిన వేలూరిగారికి ఇవే మా కన్నీటి నివాళులు.
ఏలూరులో చిన్నతనంలో నక్షత్రాలు, చందమామ గురించి రాసిన చిన్న పద్యం నుండి, థియోసాఫికల్ సొసైటీ స్కూలు మ్యాగజైన్ కోసం రాసిన వ్యాసాల నుండి, తెలుగు సాహిత్యరంగంలో నిశిత విమర్శకునిగా, కథారచయితగా, అనువాదకునిగా తనదైన ముద్రవేసుకొన్న ఆయన సాహితీ ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. 20వ శతాబ్దపు సాహిత్య ఉద్దండులెందరితోనో ఆయనకు ఉన్న వ్యక్తిగత పరిచయం, వెల్చేరు నారాయణరావు గారి వంటివారి స్నేహం, సాహచర్యం ఆయనలోని విమర్శకుడిని, రచయితను మరింతగా సానబెట్టాయి. ఈమాట పత్రికకు తొలినాళ్ళనుండి తన అండదండలను అందజేసిన ఆయన 2004వ సంవత్సరం నుండి 2014 దాకా ప్రధాన సంపాదకునిగా ఈమాటను నడిపించారు. “ఏదైనా గొప్ప కట్టడం నిర్మించాలంటే, ముందు దాని పునాది బలంగా ఉండాలి” అని నమ్మిన వేలూరి గారు, ‘ఈమాట’ పత్రికకు ది న్యూయార్కర్ పత్రిక తరహాలో ఒక అంతర్జాతీయ స్థాయి తీసుకురావాలని తపించేవారు. ఆయన సంపాదకత్వంలో ఈమాట పత్రిక తెలుగు సాహిత్యానికి ఒక దిక్సూచిలా నిలిచింది. పత్రికకు ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయడంలో ఆయన కృషి మరువలేనిది.
వేలూరి గారు కేవలం రచయితే కాదు, ఒక నిశిత విమర్శకుడు కూడా. “I have done ‘enough damage’ with eemaaTa” అని తన గురించి తాను చమత్కరించుకోగలిగిన నిరాడంబరత ఆయన సొంతం. భారతీయ ఆలంకారిక శాస్త్రాల ప్రాముఖ్యతను గుర్తించి, భారతీయ-ఆధునిక విమర్శనా విధానాల మేలుకలయికగా సాహిత్య విమర్శకు కొత్త చూపునివ్వాలని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన రాసిన కథలు, వ్యాసాలు, ఈమాట కోసం ఆయన పడిన తపన ఈ పత్రిక పాఠకుల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాయి. డా. వేలూరి వేంకటేశ్వర రావు గారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈమాట కుటుంబం ఒక ఆత్మీయమిత్రుణ్ని, సమర్థుడైన మార్గదర్శిని, శ్రేయోభిలాషిని, కుటుంబంలో పెద్దదిక్కును కోల్పోయింది.
వెదురుపొదలే కంచెలుగా, ఎక్కడ
పనసచెట్ల వేర్లపై పళ్ళు విరగ కాస్తాయో
ఆ కొండవాలు ప్రాంతపు యువకుడా, నువ్వు సరైన పని చేయి!
ఆమె మనసులో ఏముందో ఎవరికి తెలుసు? కొండవాలున
చెట్టు సన్నని కొమ్మకు వేలాడే పెద్ద పనసపండు లాగ,
ఆ పిల్లది చిన్ని ప్రాణం! ఐతే నీపై ఆమెకున్న ప్రేమయో? ఎంతో పెద్దది!
పదుల సంవత్సరాలు శ్రమించి, ప్రాచీనశిల్పులు రాతిలో మలచిన అతిలోక సౌందర్యాన్ని వీక్షించటానికి మనుషులకు కళ్ళు ఉండడం – ఆ అదృష్టం. ఆ కళ్ళు రెండు మాత్రమే ఉండడం – అన్యాయం.
“వందల ఏళ్ల తర్వాత కూడా మాక్స్వెల్ గతకాలపు ప్రకాశవంతమైన నక్షత్రాలలో ఒకటిగా వెలుగుతూనే ఉంటాడు.”
మాఘమాసం రాగానే
కిందటేడాది ఎక్కడ వదిలిపెట్టానో
ఆ కవితలక్కడే కనిపిస్తాయి.
రాత్రుల చీకటీ, దీపాల కాంతులూ,
రాత్రుల నిశ్శబ్దం, పలకరించి పోయే శబ్దాలూ,
రాత్రి లాంటి ప్రపంచం, ఎదురై, మాయమయే ప్రేమలూ
నా చూపులు వేల మైళ్ళు పరిగెత్తినా,
నీ నీడను తాకలేవు.
నా చేతులు చీకట్లోకి ఎంతగా చాచినా,
నీ వేళ్ళ వెచ్చదనాన్ని అందుకోలేవు.
పొద్దుగూకిందని
పక్షులన్నీ
చెట్లు వెతుక్కున్నాయని
వెలుతురు కిటికీ మూసేసి
చీకటి తలుపు తెరవకు
దూరాన ఉన్న కొండచరియల మీద కనిపిస్తోన్న జలపాతాల దృశ్యం అధివాస్తవిక చిత్రంలా అనిపించింది. ఏదో ఆరుబయలు రంగస్థలంలోని బృహత్తరమైన గ్రానైట్ తెరమీద జాలువారే జలధారల వర్ణచిత్రంలా అనిపించింది. అంత చక్కని దృశ్యం చిత్రించిన చిత్రకారుడెవరూ? ‘ఏ కౌన్ చిత్రకార్ హై?’ అని శాంతారామ్ సినిమాలోని పాటలో అడిగినట్లు అడగాలనిపించింది.
కథలు పుట్టేవి
వెచ్చని రెక్కల కుర్రాడు
మంచులో మునిగిన కథ
మంచు తెర మీద విరిసిన
కాంతి పూల కథ
నన్ను మోసుకు తిరగమని
నామీద కుట్రగా
ఎక్కడిదో ఎవరిదో
ఒక పక్షి
నామీద వచ్చి వాలుతుంది
ఎన్ని ఇక్కట్లు ఎదురైనా అతని దృష్టి ఎటూ చెదరకుండా గమ్యం మీదనే ఉంది. ఆ గమ్యం ఇథకా పట్టణం. ఆ పట్టణంలో ఉన్న తన భార్య పెనలొపీ, కొడుకు టెలెమాకస్. ఈపాటికి పిల్లడికి పన్నెండేళ్ళు వచ్చి ఉంటాయి. తన తల్లిదండ్రులు? వారింకా బ్రతికే ఉన్నారా?
తన్మయుం డద్దమున కెదురుగా నిలచి లా-
వణ్యముల తిలకించి మురిసిపోవునటు
చిన్మయుడు సృష్టి చిత్రమున తన వీర్య సం-
పన్నము ననుభవించు – మంకుతిమ్మ
ముష్టెత్తడానికి ఆమెకు ప్రత్యేకమైన ఏర్పాట్లేం ఉండవు. ఖాళీ చెయ్యి సాచి యాచిస్తుంది. వచ్చిన నోట్లని ఎడమ చేతిలో బిగియపట్టుకుంటుంది. సిగ్నల్ పడి వాహనాలు వెళుతుండగా పేవ్‌మెంట్ మీదికి చేరి, బొడ్డున దోపుకున్న ఒక తిత్తిలోకి ఆ మొత్తం చేరుస్తుంది.
‘ఉ’ పోతే, ఉద్భటుడంత వాడుత్తుత్తి భటుడవుతాడు. ఉపచారి పచారీ కొట్లో గుమస్తాగా చేరతాడు. మనకిక ఉగాదులూ ఉషస్సులూ ఉండవు. ఉపమానం, ఉత్ప్రేక్షలూ మాయమై, మొత్తం కవిత్వం సున్న అవుతుంది. ఉదారం దారంగా మిగులుతుంది.
వంగపండు పాటంటే వెంటనే గుర్తొచ్చేది “ఏం పిల్లడో ఎల్దుమొస్తవా”పాట.
ఈ పాటలో “ఏం పిల్లడో ఎల్దుమొస్తవా!” అని అడుగుతాడు కవి. ఎక్కడికీ? అంటే “శ్రీకాకుళంలో సీమకొండకి” అంటాడు. అపుడు ఎందుకూ? అనే ప్రశ్న వస్తుంది. “సిలకలు కత్తులు దులపరిస్తయట” అని అక్కడ జరుతున్న పోరాటాలను సింబాలిక్‌గా చెపుతాడు. శ్రీకాకుళ గిరిజన రైతుల పోరాట నేపధ్యంలో మంచి నిర్వహణ దక్షతతో రాసిన ఈ పాట తెలుగు ప్రజలను ఉత్తేజితులను చేసింది, ఉర్రుతలూగించింది.
ఈ విధంగా ఉర్దూ/హిందీ ప్రణయ భావార్ద్ర కవితలను అనువదించడం వల్ల, స్వతంత్రంగా తెలుగులో అభ్యుదయ కవులకు లేని అవకాశాన్ని పూరించుకోవడమే కాదు, ఈ కవిమల్లుడు తన కడప కత్తికి రెండువైపులా పదునేనని తన కలాన్ని కదను తొక్కించారు.
తప్పిపోయిన జీవుల కోసం వెతికే నలుగురు యువకుల కథలా ఈ నవలగా పైకి కనిపించే ఈ నవల లోపల లోతైన తాత్విక చింతన ఉంది. సమాజంలో జరుగుతున్న అనేక అంశాలపైన చర్చ ఉంది. దేనికోసమే వెతుకుతూ మరి దేన్నో కోల్పోతున్న నాగరికపు ప్రపంచానికి హెచ్చరిక ఉంది. జీవాలు సైతం మనుషుల్లా మారి అనేక అంశాలు చర్చించడం ఈ నవలలో కనిపిస్తుంది.
కాఫ్కా పేరు విననివారు ఉండరు. అతడి గురించి రెండు విషయాలు లోకానికి తెలుసు, అతన్ని చదవనివారికి కూడా. ఒకటి: తన రచనలను అన్నిటిని తన మరణానంతరం చింపి చెత్తలో వేయమని కోరాడని. రెండు: ఇద్దరమ్మాయిలతో మూడుసార్లు పెళ్ళి నిశ్చయమై, మూడుసార్లు భగ్నమయిందని; చివరకు పెళ్ళి చేసుకోకుండానే చనిపోయాడని.
ఈ పుస్తకంమీద దాదాపు 9 సంవత్సరాలు పని చేశాను. దాదాపు 900 మందిని కలిసిన తరువాతే ఈ పుస్తకం బయటకు వచ్చింది. నిర్దిష్ట ప్రణాళిక లేకుండా చేసిన వందలాది గంటల ఇంటర్వ్యూలు, సామూహిక చర్చలు, ఊరికే చెప్పుకొన్న కబుర్లు, ప్రణాళికాబద్ధమైన ప్రశ్నావళి – వీటన్నిటి ఫలితమే ఈ పుస్తకం.
కావ్య సాహిత్యం నుంచి ప్రబంధ సాహిత్యం వరకు, కాలక్రమేణా తెలుగు భాష అభివృద్ధి చెందే క్రమంలో కవులు కావ్యాలలో దృశ్యీకరణలకు ప్రాధాన్యతను పెంచుకుంటూ వచ్చారు. ఆదికవి నన్నయ మహాభారతం నుంచి ప్రబంధ కవి పింగళి సూరన కళాపూర్ణోదయం వరకూ, ఆ పిదప వచ్చిన కావ్యాలను గమనిస్తే ‘కథలను చెప్పే ధోరణి నుంచి, కథలను చూపించే పద్ధతి’ని కవులు ఆచరించారనిపిస్తుంది.
మారుతున్న కాలంతో పాటూ సాహిత్య వేదికలూ మారుతున్నాయి. ఆడియో కథలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. వీటికి యూట్యూబ్ ముఖ్య వేదిక. కనుక, ఈమాట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించాం. గతనెలలో కొత్తగా అప్లోడ్ చేసిన రచనల వివరాలు ఇవీ:
తెల్లాపూర్‌లోని ఫూలే అంబేద్కర్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్‌లో ఫిబ్రవరి 7- 8 తేదీలలో 50 మంది కొత్త తరం కవుల ‘మిలన్: వర్క్‌షాప్’ జరుగుతుంది.